![]() |
![]() |

విష్ణుప్రియ తక్కువ సమయంలోనే బుల్లితెరపై మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. టీవీ షోలు, ఈవెంట్లతో ఫుల్ సందడి చేసింది. అయితే కొంతకాలంగా బుల్లితెరపై విష్ణుప్రియ సందడి తగ్గిపోయి, సోషల్ మీడియాకే పరిమితమైంది. అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ.. ఎప్పుడూ ఫొటోలు, రీల్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అసలు విష్ణుప్రియ టీవీ షోలు తగ్గించి, సోషల్ మీడియాకి పరిమితం కావడానికి కారణం ఏంటి? అనేది కొంతకాలంగా అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి సమయంలో విష్ణుప్రియ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక రీల్ ని షేర్ చేసిన విష్ణుప్రియ.. "మెంటల్ హెల్త్ ఖరాబ్, ఫిజికల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, రిలేషన్ ఖరాబ్, షెడ్యూల్ ఖరాబ్, అయినా కూడా ఇలా చిల్ అవుతూనే ఉంటున్నాను" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెల్త్ ప్రాబ్లెమ్స్ తో పాటు, లవ్ బ్రేకప్.. విష్ణుప్రియ కెరీర్ పై ప్రభావం చూపాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బుల్లితెరకు బ్రేక్ ఇచ్చిన విష్ణుప్రియ మొదట ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక బాట పట్టింది. కొంతకాలంగా ఫిజికల్ ఎక్సర్ సైజ్ లు చేస్తుంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు సడెన్ గా కెరీర్ తో సహా అన్నీ ఖరాబ్ అయ్యాయి, అయినా చిల్ అవుతున్నాను అంటుంది. దీంతో అసలు విష్ణుప్రియకి ఏమైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |